E-Paper
Advertisement

Crop Burning: హైదరాబాద్‌కు డేంజర్ బెల్స్.. సాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ నిజాలు..?

Crop Burning: హైదరాబాద్‌కు డేంజర్ బెల్స్.. సాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ నిజాలు..?
Advertisement

Crop Burning: స్వేచ్చ బ్యూరోం పంట వ్యర్ధాల కాల్చివేత ఈ యాసంగి నాటికి 16.85లక్షల ఎకరాలకు చేరింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 1.70లక్షల ఎకరాల్లో పంట వ్యర్ధాలను కాల్చివేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల నెలకొల్పిన అధునాతన ఆర్ఎస్ అండ్ జీఐఎస్(రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్ సిస్టం) ప్రయోగ శాలలో గత ఏప్రిల్, మే,జూన్ నెలల్లో ఉపగ్రహ ఛాయా చిత్రాలని విశ్లేషించి ఈ గణాంకాలని విడుదల చేశారు.

మోత్తం పూర్తి డేటా..

రాష్ట్రంలో16లక్షల 85వేల 544 ఎకరాల్లో పంట వ్యార్థాలను ఆయా పొలాల్లోనే కాల్చగా, సుమారు 9లక్షల 5వేల 498 ఎకరాల్లో వరికోత అనంతరం వరికొయ్యలను కాల్చివేశారు. మరో 8లక్షల 49వేల 334 ఎకరాల్లో ఇతర పంటలైన మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలవ్యర్ధాలను కాల్చివేశారు. రాష్ట్రంలోని 31జిల్లాలో పంటల వ్యర్థాలను కాల్చివేశారు. అందులో మొదటి ఐదు జిల్లాల్లో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. కామారెడ్డిజిల్లాలో లక్షా 32వేల 138 ఎకరాలు, ఖమ్మంలో లక్షా 22వేల 79 ఎకరాలు, కరీంనగర్ లో 99వేల 121 ఎకరాలు, పెద్దపల్లిలో 89వేల 400 ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసినట్లు వెల్లడైంది. వ్యర్ధాల కాల్చివేసిన విస్తీర్ణం లో పై ఐదు జిల్లాల వాటా 34 శాతం ఉండటం గమనార్హం. అదే విధంగా అతి తక్కువ పంట వ్యర్ధాలని కాల్చివేసిన జిల్లాలు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి.

Advertisement

Also read: హైకోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్.. సాయికృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్టులో వణికించే నిజాలు!

ముంచుకొస్తున్న ప్రమాదం

పంట వ్యర్ధాలని కాల్చివేయడం వల్ల నేల ఆరోగ్యం,గాలి నాణ్యత లు తీవ్రంగా కలుషితం అవుతాయనీ, ఈ పంట వ్యర్ధాల కాల్చివేత ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది.పంట వ్యర్ధాల కాల్చివేత మూలాన నేల లోని రెండున్నర సెంటిమీటర్ల దిగువ భాగం లో నేల ఆరోగ్యానికి, పంటలకి సంబంధించిన లాభసాటి బ్యాక్టీరియా, ఫంగల్ సూక్ష్మ జీవులు ఈ అగ్నికి ఆహుతి అవుతాయి. నేల నిస్సారం గా మారే ప్రమాదం ఉంది.ఒక టన్ను వరి గడ్డి, కొయ్యలని పంట పొలాల్లో కాల్చివేయడం వల్ల ఐదున్నర కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ అగ్నికి అహుతి అయి గాలి లో కలసిపోతాయి. ఒక ఎకరానికి సుమారు రెండున్నర టన్నుల వరిగడ్డి , వ్యర్ధాలు వస్తాయని, అనగా ఒక ఎకరం వరి విస్తీర్ణంలో ఈ పంట వ్యర్ధాలని కాల్చినట్లయితే 13.5 కిలోల భాస్వరం, 6.75 కిలోల పొటాష్ గాలి లో కలసిపోయి తద్వారా గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది.

కార్బన్ మోనాక్సైడ్..

Advertisement

ఈ లెక్కల ప్రకారం 23.63 లక్షల కిలోల నత్రజని, 11.90 లక్షల కిలోల భాస్వరం,1062 లక్షల కిలోల పొటాష్ ఈ మూడు మాసాలలోనే పంట వ్యర్ధాల కాల్చివేత వల్ల గాలిలో కలసిపోయాయి. ఈ పంట వ్యర్ధాలని కాల్చకుండా వీటిని తిరిగి నెలలోనే కలియదున్ని కొంత కాలం కుళ్ళనిచ్చినట్లయితే నేల సారం పెరగటం తో పాటు కాలుష్యం తగ్గించగలిగే వాళ్ళం. ఒక టన్ను పంట వ్యర్ధాల కాల్చివేత వల్ల 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ తో పాటు 1460 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ , 200 కిలోల బూడిద గాలిలోకి విడుదల అయినట్లు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణం లో ఉష్నోగ్రత పెరుగుదలకి ప్రధాన కారణమైన మీథేన్ ,నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు గాలిలోకి విడుదల అవుతాయని తెలిపారు.ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే ప్రస్తుతం ఎయిర్ పోల్యూషన్ ఇండెక్స్ లో సురక్షితం గా ఉన్న హైదరాబాద్ మహానగరం వచ్చే 10 ఏళ్లలో మరో ఢిల్లీ లా తయారు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పంట వ్యర్థాలకు సంబంధించిన వివరాలను బుధవారం జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు.

Also read; CPI Crisis: కూనంనేని సాంబశివరావు పై.. సొంత పార్టీ కేడర్ తీవ్ర గుస్సా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×