// // Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని? -->
E-Paper
Advertisement

Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని?

Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని?
Advertisement

Delhi:ఢిల్లీలో టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్రమంత్రులను కలిశారు. అదే సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఎదురుపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు రోజా. ఇంతకీ రోజా ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్టు? అంటూ టీడీపీలో చర్చ మొదలైంది.

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా

Advertisement

ఢిల్లీలో ఎదురెదురు పడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- ఏపీ మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఒకరిని నొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. బుధవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటు భవనానికి వచ్చారు.

అదే సమయంలో ఇరువురు తారసపడ్డారు. సీఎంను పలకరించారు రోజా. రేవంత్‌రెడ్డితో వెంట నాయకులు ఆమెని ఏదో ప్రశ్నించారు. పని మీద వచ్చానని ఆమె సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని రోజా పలకరించారు.

Advertisement

గడ్కరీతో రోజా సమావేశం.. టీడీపీ నేతల ఆరా

ఇంతకీ ఢిల్లీకి మాజీ మంత్రి రోజా ఎందుకు వెళ్లినట్టు? ఈ టూర్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? వైసీపీ వ్యవహారాలను తెర వెనుక ఆమె చక్కబెడుతున్నారా? హస్తినలో రోజా ఉన్న విషయం తెలియగానే టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆమె పర్యటన గురించి ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ వెర్షన్ మరోలా ఉంది.

రోజా నియోజకవర్గం నగరిలో 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఉంది. దాన్ని పరిరక్షించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. హిస్టరీకి సంబంధించిన వ్యవహారాలను టూరిజం శాఖ చూస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, లేదంటే సహాయమంత్రి సురేష్ గోపి కలవాలని అంటున్నారు. మంత్రి గడ్కరీని రోజా కలవడం వెనుక ఏదో జరుగుతోందని చర్చ అప్పుడే మొదలైంది.

ALSO READ: ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×