E-Paper
Advertisement

CM Revanth Congrats: 31,382 మంది అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Congrats: 31,382 మంది అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy tweet on group -1 prelims results: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మందికి ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు. అక్టోబర్ 21నుంచి 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలోనూ విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరుతారంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement

Also Read: హీరోకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం

అయితే, టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారం ఉదయం టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం విధితమే. తుది కీతోపాటు రిజల్ట్స్ ను కూడా టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×