E-Paper
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో 105 యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు.. కేంద్రం సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణలో 105 యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు.. కేంద్రం సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయ‌నున్నట్లు నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. YIIRSల‌తో ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా 4 ల‌క్షల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌న్నారు.

YIIRSల నిర్మాణం, ఇత‌ర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయ‌మ‌వుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మిన‌హాయించాల‌ని నిర్మలా సీతారామ‌న్‌ను సీఎం కోరారు.

కేంద్ర మంత్రులతో భేటీ

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం అందజేశారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లకు పెట్టే ఖర్చును ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్‌ ఇండియా స్కూళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను పంపాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఐఐఎం కోసం 200 ఎకరాల భూమిని గుర్తించినట్లు సీఎం తెలిపారు. అదే విధంగా తెలంగాణకు 9 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం కోరారు.

Advertisement

Also Read: Ponnam Prabhakar: ఉపాధి హామీ పథకానికి ఉరి.. గాంధీ పేరు తొలగించడం దుర్మార్గం: కేంద్రంపై మంత్రి పొన్నం ధ్వజం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×