E-Paper
Advertisement

CM Revanth Reddy: తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు.. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన..

CM Revanth Reddy: తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు.. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన..
Advertisement

 

CM Revanth Reddy latest news

Advertisement

CM Revanth Reddy latest news(Political news today telangana): తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 6న జరగనున్న తుక్కుగూడా సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ సభా ప్రాంగణాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

మరోవైపు తుక్కుగూడ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ తుక్కుగూడ నుంచే ప్రారంభించింది. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోయింది. ఈ హామీలను పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకుపోయారు. ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ తో కాంగ్రెస్ తుక్కుగూడలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: కాంగ్రెస్‌లో చేరికపై విమర్శలు.. బీఆర్ఎస్ నేతలకు కడియం కౌంటర్..

తెలంగాణలో కాంగ్రెస్ 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×