E-Paper
Advertisement

CM Tours: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిక్వెస్టులు.. ఎందుకో తెలుసా..?

CM Tours: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిక్వెస్టులు.. ఎందుకో తెలుసా..?
Advertisement

CM Tours: స్వేచ్ఛ బ్యూరో: సీఎం జిల్లా టూర్లు చేపట్టాలని పలువురు ఎమ్మెల్యేలు పట్టుపడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని మెజార్టీ ఎమ్మెల్యేలు సీఎంను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రిని తమ నియోజకవర్గానికి రప్పించుకుంటే డెవలప్ మెంట్ మరింత స్పీడప్ అవుతుందనేది ఆయా ఎమ్మెల్యేల కోరిక. ఈ నేపథ్​యంలోనే సీఎం జిల్లా టూర్లపై ఎమ్మెల్యేల్లో ఆసక్తి నెలకొన్నది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఎప్పుడు? తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తారు? అని అధికార పక్షానికి చెందిన శాసన సభ్యులు సీఎంవోని ఉన్నతాధికారుల నుంచి ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి సీఎంను కలుస్తున్న ఎమ్మెల్యేలంతా “సార్.. మా నియోజకవర్గానికి ఒక్కసారి రండి”అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల పంపిణీ, డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.

మైలేజ్ కోసం.. నెక్ట్స్ విజయానికి ప్రయత్నాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తయింది. ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరింత స్పీడ్ గా చేస్తే తమకు మైలేజ్ వస్తుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.అంతేగాక సీఎం నియోజకవర్గాల్లో పర్యటిస్తే తమకు ప్లస్ అవుతుందని కొందరు ఎమ్మెల్యేలు గట్టిగా నమ్ముతున్నారు. అంతేగాక సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తే ఆ మైలేజ్ నేరుగా స్థానిక ఎమ్మెల్యే ఖాతాలోకి వెళ్తుందనేది వారి భావన. అంతేగాక సీఎం పర్యటనతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది.

Advertisement

Also read: నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

గ్రూపు రాజకీయాలకు బ్రేక్..

గ్రూపు రాజకీయాలకు బ్రేక్ పడుతుందని బలంగా నమ్ముతున్నారు. అంతేగాక ముఖ్యమంత్రి పర్యటన ఖరారైతే. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన నిధులు వెంటనే విడుదలవుతాయి. రోడ్ల మరమ్మతులు, పెండింగ్ ఫైళ్లు చకచకా కదులుతాయని ఓ ఎమ్మెల్యే ఆఫ్​ ది రికార్డులో తెలిపారు. ​ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోవడానికి ఈ పర్యటనలు ఒక అస్త్రంలా మారనున్నాయి. సీఎం పర్యటన సక్సెస్ అయితే స్థానికంగా ఎమ్మెల్యే ఇమేజ్ పెరగడంతో పాటు, కేడర్‌లో కొత్త జోష్ వస్తుంది. అందుకే ప్రతి ఎమ్మెల్యే తమ జిల్లాకు సీఎం షెడ్యూల్ మొదట ఉండాలని కోరుతున్నారు.

గతంలోనే సీఎం హామీ.. ఉమ్మడి జిల్లాల వారీగా ప్లాన్..

Advertisement

​గతంలో జరిగిన పలు మీటింగ్ లు, సమావేశాలతో పాటు, అసెంబ్లీ సమావేశాల వేదికగానూ ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలకు ఒక హామీ ఇచ్చారు. కేవలం సచివాలయానికో, హైదరాబాద్‌కో పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం.. ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనల షెడ్యూల్ రూపొందించే పనిలో సీఎంఓ నిమగ్నమైనట్లు తెలిసింది.ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గాలకు తప్పనిసరిగా రావాలని ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితేప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో పాటు, ఆ పరిధిలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల సమీక్షలను ఈ టూర్‌లో భాగం చేయాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో బస చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే సీఎం జిల్లా పర్యటనల తుది షెడ్యూల్ ఖరారు కానున్నది.

Also read: Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×