E-Paper
Advertisement

Telangana Cabinet: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో..?

Telangana Cabinet: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో..?
Advertisement

Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్‌పీ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యచరణపై కేబినెట్ ‌లో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు చర్చిస్తున్నారు. కేస్ ను వాదించిన సీనియర్ న్యాయ వాదులు, న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాల తో నివేదిక ఇవ్వాలని అధికారులకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే.. తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వర్సిటీ కి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు చేసేందుకు మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతగా రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు కాసేపట్లో తెలియనుంది. మంత్రి వర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ మినహా అందరూ మంత్రులు, సీఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా ఉన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×