E-Paper
Advertisement

TS Cabinet Meeting : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

TS Cabinet Meeting : నేడు తెలంగాణ కేబినెట్  సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!
Advertisement
Telangana cabinet meeting

Telangana cabinet meeting today(Latest political news telangana):

తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, పెండింగ్‌ పనులపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 50 అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ శాఖల్లో పెండింగ్‌, అభివృద్ధి పనులపై ఇప్పటికే నివేదికలు రూపొందించారు. ఆ నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించారు.

Advertisement

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టంపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. వరద నీటిలో మునిగిన గ్రామాలు, బాధితులకు పునరావాసం, వ్యవసాయ పనుల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పంట రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపు, దళితబంధు రెండోవిడత, గృహలక్ష్మి, బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం ఇలాంటి అంశాలను కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది.

ఆగస్టు 3న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే బిల్లులపైనా కేబినెట్ లో చర్చించనున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×