E-Paper
Advertisement

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినేట్ కీల‌క నిర్ణ‌యాలు.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినేట్ కీల‌క నిర్ణ‌యాలు.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
Advertisement

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తీర్పు అనంతరం ఈ ఎన్నికలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైన జనాలందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటన చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సర్పంచ్ ఎన్నికలపై కీలక ప్రకటన

తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్లో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. వచ్చే నెల 7వ తేదీన మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంటుందని.. అప్పుడే దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుంద‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

SLBCపై రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Advertisement

SLBC ప్రాజెక్టును 2026 నాటికి లేదా 2027 జనవరి ప్రారంభం నాటికి పూర్తి చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను ఫ్లోరైడ్ రహిత ప్రాంతాలుగా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 44 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే 35 కిలోమీటర్లు పూర్తయిందని, మిగతాది కూడా ఫినిష్ చేస్తామన్నారు. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్, వరంగల్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు.

1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ లో ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే రామగుండంలో 52 ఏళ్ల కిందటి థర్మల్ స్టేషన్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో దాన్ని తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే 10 సంవత్సరాల కారం పాటు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు అలాగే డిమాండ్ అంచనాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని విద్యుత్ శాఖను తెలంగాణ మంత్రి మండలి ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read:  Suryakumar Yadav: గిల్ కు సూర్య వెన్నుపోటు..టీమిండియా నుంచి తొలిగించాల‌ని కుట్ర‌లు.. చ‌క్రం తిప్పిన‌ గంభీర్

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×