E-Paper
Advertisement

Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం
Advertisement

Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి సహాయక చర్యల నిమిత్తం, సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని కేబినెట్ తీర్మానించింది. ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఉంటారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు, వారి మత సంప్రదాయాల ప్రకారం సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకుగాను, బాధిత కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబానికి ఇద్దరు సభ్యులను ప్రభుత్వ ఖర్చులతో అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

అంతకుముందు, కేబినెట్ సమావేశం ప్రారంభంలో ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది. ఆయన సేవలను స్మరించుకుంది. అందెశ్రీ జ్ఞాపకార్థం ‘స్మృతి వనం’ ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×