E-Paper
Advertisement

New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు

New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు
Advertisement

New Schemes: స్వేచ్ఛ బ్యూరో: 2026-27వార్షిక బడ్జెట్ లో ప్రభుత్వం 9 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రజల్లో వచ్చేలా ఈ స్కీమ్స్ ను రూపకల్పన చేశారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు ప్రతిపాదించారు. ఈ స్కీమ్స్ ద్వారా ప్రభుత్వం, పార్టీకి మరింత మంచి పేరు వస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

నూతన పథకాలు ఇవే..

1.ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కొరకు సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ను ప్రారంభించనున్నారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.4,000 కోట్లు ప్రతిపాదించారు.

2. చేయూత

Advertisement

చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేయనున్నారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు.

3. తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ళు..

ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలగాణ పబ్లిక్ స్కూళ్ళు గా మార్పు చేయాలని ప్రతిపాదించారు. ఈ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ నుండి 12 వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుంది. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.500 కోట్లు ప్రతిపాదించారు.

Advertisement

Also read: Student Suicide: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!

4. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం

2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్ర‌తి విద్యార్థికివారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.800 కోట్లు ప్రతిపాదించారు.

5. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించనున్నారు.ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.100 కోట్లు ప్రతిపాదించారు.

6.నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం

ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిచనున్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందించనున్నారు.

7. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం

ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది, 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే2కోట్ల రూపాయలుఅదనపుకవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు.ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ రెండు పథకాల మొత్తానికి బడ్జెట్ లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.

8 సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం..

రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణను వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికివీసా మార్గదర్శకత మరియు విదేశీ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం “ సీఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం”ను ప్రారంభించనున్నారు. ఈ బడ్జెట్ లో సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం పథకానికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.

9. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్ షిప్..

ఏటీసీ లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల రూపాయలు స్కాలర్ షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ లో ఏటీసీ ట్రైనీలకు స్కాలర్ షిప్ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించారు.

Also Read: TG Budget 2026: రాష్ట్రంలో కీరోల్ పోషించే రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు.. తగ్గినవి పెరిగినవి ఇవే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×