// // Telangana BJP : 35 శాతం ఓట్లు.. 10 ఎంపీ సీట్లు.. బీజేపీ టార్గెట్ ఇదే..! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Telangana BJP : 35 శాతం ఓట్లు.. 10 ఎంపీ సీట్లు.. బీజేపీ టార్గెట్ ఇదే..!

Telangana BJP : 35 శాతం ఓట్లు.. 10 ఎంపీ సీట్లు.. బీజేపీ టార్గెట్ ఇదే..!
Advertisement

Telangana BJP : పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. 10 ఎంపీ సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. 35 శాతం ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మీటింగ్ లో రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్‌ పాల్గొన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై సమాలోచనలు జరిపారు.

Advertisement

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ సీట్లు సాధించింది. అప్పుడు ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీలు గెలిచారు. ఈసారి రెట్టింపునకు పైగా లోక్ స్థానాలు గెలివాలని కాషాయ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

మరోవైపు పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైనా కిషన్ రెడ్డి చర్చించారని తెలుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలిచింది. అయితే ఇప్పటి వరకు సభాపక్షనేతను ఎన్నుకోలేదు. హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజాసింగ్ కు ఆ పదవి కట్టబెడతారా? లేక మరో నేతకు ఆ బాధ్యతలు ఇస్తారనే అనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×