E-Paper
Advertisement

మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ క్లారిటీ.. ఇకపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కమలం కన్ను

మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ క్లారిటీ.. ఇకపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కమలం కన్ను
Advertisement

Telangana Bjp: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీలు కార్యకర్తలతో సమీక్ష-సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా సింగల్‌గా పోటీ చేస్తామని తేల్చేశారాయన.

మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ క్లారిటీ

Advertisement

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు కసరత్తు మొదలు పెట్టేశాయి. ఇప్పటికే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రంగం సిద్ధమైంది. దీనిపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో పార్టీల అధినేతలు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం.

తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జనగామ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో  ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చేశారాయ. ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు.

Advertisement

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కమలం కన్ను

ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉన్నట్లుండి రాంచందర్‌రావు ఆ వ్యాఖ్యల వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అంతర్గతంగా పెట్టుకుంటున్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతోంది. అందుకు ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ విషయం లోతుగా వెళ్లింది.

దాన్ని నుంచి బయటపడేందుకు టీ బీజేపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు అధికార పార్టీ నేతలు. అందుకే ఆయన ఏ జిల్లాకు వెళ్లినా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడం వెనుక అసలు ఉద్దేశమని అంటున్నారు. అన్నట్లు మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేనతో జత కట్టారని గుర్తు చేస్తున్నారు.

ALSO READ: ఒక్క నిమిషం కూడా ఆగక్కర్లేదు.. KBR పార్క్ రూట్‌లో పోలీసుల మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

తెలంగాణలో విజయం సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకు కీలకమని భావించారట టీబీజేపీ చీఫ్.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక ఇదే కారణమని అంటున్నారు. మొత్తానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కేడర్‌ను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తోంది తెలంగాణ బీజేపీ.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×