E-Paper
Advertisement

BJP Committees: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి.. కమిటీ ఏర్పాటు..!

BJP Committees: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి.. కమిటీ ఏర్పాటు..!
Advertisement

BJP Committees: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి నెలకొంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నేతలు, ఆశావహులందరికీ న్యాయం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం భారీ కమిటీలను ప్రకటించింది. మొదట జంబో కమిటీల ఏర్పాటుకు హైకమాండ్ విముఖత చూపినప్పటికీ, రాష్ట్ర పరిస్థితులు, నేతల ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని చివరకు పచ్చజెండా ఊపింది. పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు ఏకంగా 27 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. ఇందులో పాత టీం నుంచి ఏడుగురిని కొనసాగించగా, 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం విశేషం. సామాజిక సమీకరణలు, చురుకైన పనితీరు ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.

అధికారిక బాధ్యతలు

టీవీ చర్చల్లో పార్టీ వాణిని వినిపించేందుకు 13 మందిని మీడియా ప్యానలిస్టులుగా ఎంపిక చేశారు. వీరు వివిధ అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు. వీటితో పాటు, పార్టీకి అనుబంధంగా ఉండే 23 సెల్స్(విభాగాలు)కు కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు. ఈ జంబో కమిటీ ద్వారా వీలైనంత ఎక్కువ మంది నేతలకు అధికారిక బాధ్యతలు అప్పగించినట్లు అయ్యింది. అయితే, ప్రస్తుత జాబితాలో చోటు దక్కని వారిని నిరాశపరచకుండా, భవిష్యత్తులో వేయబోయే ఇతర కమిటీల్లో వారికి చోటు కల్పిస్తామని పార్టీ భరోసా ఇచ్చింది. రాబోయే ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఈ భారీ కార్యవర్గాన్ని రంగంలోకి దింపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Also Read: Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి..!

రాష్ట్ర అధికార ప్రతినిధిగా..

హిందుత్వ వాదం, ప్రధాని మోడీ పాలన నచ్చి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చికోటి ప్రవీణ్ కు ఆదిలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఎట్టకేలకు వాటిని అధిగమించి స్టేట్ స్పోక్స్ పర్సన్ల జాబితాలో ప్రవీణ్ చోటు దక్కించుకున్నారు. పార్టీపై తనకున్న నిబద్ధతకు అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినట్లు ఆయన చెబుతున్నారు. కాగా తనకు బాధ్యతలు అప్పగించడంపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం అధ్యక్షుడు రాంచందర్ రావును ఆయన కలిశారు. రాంచందర్ రావును శాలువా, బొకేతో సన్మానించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు చికోటి ప్రవీణ్.., రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సైతం ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఎదుగుదలలో తనను భాగస్వామిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Also Read: Tourism Vigilance: తెలంగాణ టూరిజంలో విజిలెన్స్ వీక్.. దొరికిందే చాన్స్ అంటూ..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×