E-Paper
Advertisement

Telangana Assembly Budget-2026 Live: తెలంగాణ బడ్జెట్- 2026, వివిధ రంగాలకే కేటాయింపుల హైలైట్స్

Telangana Assembly Budget-2026 Live: తెలంగాణ బడ్జెట్- 2026, వివిధ రంగాలకే కేటాయింపుల హైలైట్స్
Advertisement

Telangana Assembly Budget-2026 Live: తెలంగాణ బడ్జెట్- 2026- 27 ఏడాదికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. ఈసారి రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఏ శాఖలకు ఎంత కేటాయించారు అనేదానిపై మంత్రి వివరణ ఇస్తున్నారు.

శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్లతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు భారీగా నిధులు సమకూర్చారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అంబేడ్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నామని, రాష్ట్ర పురోభివృద్ధికి ఈ బడ్జెట్ దిక్సూచి వంటిదని పేర్కొన్నారు.

Advertisement

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ప్రకటన చేశారు విత్త మంత్రి భట్టి విక్రమార్క. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ. 2000 చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. జూన్ 2, 2026 నుండి అమల్లోకి రానుంది. ఈ పథకానికి రూ.4 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.

తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లు

Advertisement

రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 1, 48, 185 కోట్లు

పన్నేతర ఆదాయం రూ. 35,730 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు

మూల ధన వ్యయం రూ.82,870 కోట్లు

మూల ధన వ్యయం రూ.47,267 కోట్లు

బహిరంగ మార్కెట్ రుణాలు రూ.73,383 కోట్లు

కేంద్రప్రభుత్వ రుణాలు రూ. 5,500 కోట్లు

ఇతర రుణాలు రూ. 1000 కోట్లు

లోన్లు, అడ్వాన్సులు రూ.1486 కోట్లు

గ్రాంట్లు రూ. 24,166 కోట్లు

గిరిజన అభివృద్ధి కోసం- రూ. 7,937 కోట్లు

షెడ్యూల్ కులాల సంక్షేమం రూ. 11,784కోట్లు

రాజీవ్ యువ వికాసం పథకం రూ. 6,000 కోట్లు

గృహ నిర్మాణ శాఖ కోసం(ఇందిరమ్మ ఇండ్లు) రూ. 7,430 కోట్లు

ఐటీ శాఖకు రూ. 875 కోట్లు పరిశ్రమల రంగానికి రూ. 3,490 కోట్లు

చేనేత రంగానికి రూ. 258కోట్లు

పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి రూ. 33,688 కోట్లు

నీటి పారుదల శాఖ కు రూ. 22,615 కోట్లు

రవాణా ,రోడ్డు భవనాల శాఖ రూ. 12,789 కోట్లు

న్యాయశాఖ రూ. 2,367 కోట్లు పట్టణాభివృద్ధి శాఖ రూ. 17,907 కోట్లు

విద్యుత్ శాఖకు రూ. 21, 285 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ.7.366 కోట్లు

పశుసంవర్థక శాఖకు రూ.1529 కోట్లు

ఇందిర సౌర గిరిజల వికాసం- రూ. 600 కోట్లు

తెలంగాణ పబ్లిక్ స్కూల్లకు రూ.500 కోట్లు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రూ. 500 కోట్లు

గోదావరి పుష్కరాలు రూ. 500 కోట్లు

ఆలయాల అభివృద్ధికి సాయం రూ. 440 కోట్లు

మెట్రో రైలు రుణాల కోసం రూ. 500 కోట్లు

మిషన్ భగీరథ అర్భన్ రూ. 500 కోట్లు

హెచ్ఎండీఏలో అభివృద్ధి పనులకు రూ. 500 కోట్లు

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు

ఉన్నత విద్య రూ.5443 కోట్లు

హోంశాఖ రూ.11907 కోట్లు

పట్టణాభివృద్ధి శాఖ రూ.17,907 కోట్లు

రెవెన్యూ శాఖ రూ. 4020 కోట్లు

మాధ్యమిక విద్య రూ.21.231 కోట్లు

రవాణా శాఖ రూ.4,491 కోట్లు

 

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×