E-Paper
Advertisement

సోలార్ కరెంటును పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

సోలార్ కరెంటును పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
Advertisement

Solar Expansion: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 లక్ష్యాలకు అనుగుణంగా, విద్యుత్ డిమాండ్ కేంద్రాలకు సమీపంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సరికొత్త పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో..

రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 18(33/11 కేవీ) విద్యుత్ సబ్‌స్టేషన్లలో మొత్తం 19 మెగావాట్ల సామర్థ్యం గల నేలపై అమర్చే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి అయ్యే రూ.66.50 కోట్ల అంచనా వ్యయాన్ని ఆయా డిస్కమ్‌లు భరిస్తాయని పేర్కొన్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 8 సబ్‌స్టేషన్లలో 8 మెగావాట్ల ప్లాంట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 10 సబ్‌స్టేషన్లలో 11 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా, తాళమడుగు మండలం, కజ్జర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని సర్వే నంబర్ 142లో గల 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాంట్ ఏర్పాటు కోసం ఎన్పీడీసీఎల్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Also Read: వాహనదారులకు మళ్లీ షాక్‌.. రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు, లబోదిబో మంటున్న ఆటోలు, క్యాబ్‌లు

2029-30 ఆర్థిక సంవత్సరం

ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీజీ రెడ్కో) నోడల్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్టర్లను పారదర్శకమైన పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నారు. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని, అలాగే 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఇంధన శాఖ పేర్కొంది.

Advertisement

Also Read: తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×