E-Paper
Advertisement

Tummala Nageswara Rao: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తాజా పరిస్థితి

Tummala Nageswara Rao: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తాజా పరిస్థితి
Advertisement

Tummala Nageswara Rao: అయ్యయ్యో.. దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అయితే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుమారు ఐదు రోజుల క్రితం వ్యక్తిగత పర్యటనపై దుబాయ్ వెళ్లారు. తన కుటుంబ సభ్యులలో ఒకరికి మెరుగైన వైద్య చికిత్స అందించే నిమిత్తం ఆయన అక్కడకు చేరుకున్నారు. కానీ, చికిత్స ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి రావాలని భావించినప్పటికీ, అక్కడ అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు ఆయన ప్రయాణానికి ఆటంకంగా మారాయి. దీంతో అయన అక్కడే చిక్కుకున్నారు.

విమానాశ్రయంపై దాడులు..
అయితే పశ్చిమాసియాలో పెరిగిన యుద్ధ వాతావరణం కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల విమానాశ్రయానికి స్వల్ప నష్టం వాటిల్లడంతో పాటు భద్రతా పరమైన ఆందోళనలు కూడా పెరిగాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన యూఏఈ ప్రభుత్వం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసింది.

Advertisement

రద్దైన విమానాలు – నిలిచిన రాకపోకలు
ఈ దాడుల నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని విమాన సర్వీసులను వెంటనే రద్దు చేసింది. ఎయిర్‌పోర్టు రన్‌వేలు, పరిసర ప్రాంతాలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు ఏ విమానాన్ని కూడా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత హైకమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం తెలిపారు.

Also Read: కాంగ్రెస్‌లో పదవులు పొంది.. కంటికి కనిపించని మహిళా ఫైర్ బ్రాండ్స్ ..?

Advertisement

కొనసాగుతున్న వేచిచూపు
ప్రస్తుతానికి దుబాయ్ ఎయిర్‌ పోర్ట్ అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే మంత్రి ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాకుండా అబుదాబి, దోహా వంటి ఇతర ప్రధాన విమానాశ్రయాల్లో కూడా ఇవే పరిస్థితులు నెలకొనడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×