E-Paper
Advertisement

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?
Advertisement

TG Farmer Registry: స్వేచ్ఛ బ్యూరో: రైతురిజిస్ట్రీ నమోదుప్రక్రియలో 110% సాధనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది. డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకింద రైతురిజిస్ ట్రీనమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం 100% నమోదు పూర్తి చేసి, భారతప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్నిమించి సాధించి దేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

ప్రణాళికా బద్ధమైన చర్యలు

తెలంగాణకు నిర్దేశిత లక్ష్యమైన 39,77,791 మంది రైతుల స్థానంలో 43,59,371 మందిరైతులనునమోదుచేసి, 110% లక్ష్యాన్నిసాధించింది. రైతురిజిస్ట్రీసృష్టి, రాష్ట్రంప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ప్రత్యేక సహాయం కింద రూ.422.64కోట్లు ప్రోత్సాహకాన్ని మంజూరు చేసింది. వ్యవసాయశాఖమంత్రి తుమ్మలనాగేశ్వరరావు దూరదృష్టి, నాయకత్వం, నిరంతరపర్యవేక్షణలో సాధించగలిగింది. గ్రామస్థాయి వరకు సమన్వయంతో పనులను సమీక్షిస్తూ పురోగతిని నిరంతరం పర్యవేక్షించారు. మిగిలినపట్టాదారులను త్వరితగతిన నమోదు చేయడానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన రైతులందరినీ పూర్తిస్థాయిలోచేర్చేదిశగాక్షేత్రస్థాయిలోప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రణాళికా బద్ధమైన చర్యలు, సమగ్ర పర్యవేక్షణ క్షేత్రస్థాయి అమలుతో అన్ని జిల్లాల్లో రైతుల నమోదు విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం వ్యవసాయసేవల పారదర్శకతను మరింత బలోపేతం చేసింది. సంక్షేమపథకాలుసమయానుకూలంగా, అర్హులైనలబ్ధిదారులకునేరుగా అందేవిధంగా డేటా ఆధారితవ్యవసాయపరిపాలనకు ఇదిదోహదపడుతుంది.

Advertisement

Also Read: TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?

రైతు రిజిస్ట్రీవ్యవసాయరంగంలో..

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయశాఖ సిబ్బందిని, వ్యవసాయవిస్తరణాధికారులు, మండలవ్యవసాయఅధికారులు, క్షేత్రసిబ్బంది, సాంకేతికబృందాలు, జిల్లాస్థాయి అధికారులను అభినందించారు. నిర్ణీతగడువులోప్రతి అర్హత కలిగిన రైతును చేరుకోవడంలో చూపినకృషి, సమన్వయం, అంకితభావాన్నిప్రశంసించారు. రైతు రిజిస్ట్రీవ్యవసాయరంగంలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, సంక్షేమ పథకాలు, సేవలను ఆలస్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు దోహదపడుతుంది. డిజిటల్వేదికలనువినియోగిస్తూరైతుసంక్షేమం, సేవల మెరుగుదల, సుస్థిరవ్యవసాయ అభివృద్ధిదిశగా వ్యవసాయశాఖ, తెలంగాణ ప్రభుత్వం తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది.

అధికారికగణాంకాలప్రకారం:

Advertisement

రాష్ట్రంలోనిమొత్తంపట్టాదారులు: 73.82 లక్షలు
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం: 39,77,791 మంది రైతులు
తెలంగాణసాధన: 43,59,371 మంది రైతులు
సాధించిన శాతం: 110%

Also Read: Harish Rao: భూ భారతి కాదు.. భూ దోపిడీ.. సిట్ విచారణకు హరీశ్ రావు డిమాండ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×