E-Paper
Advertisement

Praja Palana: ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ సూపర్ సక్సెస్.. రికార్డు స్థాయిలో నమొదైన విజయాలివే..?

Praja Palana: ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ సూపర్ సక్సెస్.. రికార్డు స్థాయిలో నమొదైన విజయాలివే..?
Advertisement

Praja Palana: స్వేచ్చ బ్యూరో: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణ విజయవంతంగా అమలైంది. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు అన్ని విభాగాలు వివిధ థీమ్‌లతో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లేలా నిర్వహించిన కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి. గ్రామ స్థాయిలో 12,760 గ్రామ పంచాయతీల్లో 12,758 చోట్ల గ్రామ సభలు, 3,288 మున్సిపల్‌ వార్డుల్లో 3,175 వార్డు సభలు జరిగాయి. మొత్తం 15,76,219 మంది పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,10,414 మంది, జిల్లా స్థాయిలో 32 జిల్లాల్లో 37,294 మంది పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో 32,451 మంది లబ్ధిదారులకు ఆస్తుల మంజూరు జరిగింది. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా 12,700 గ్రామ పంచాయతీలు, 135 పట్టణ స్థానిక సంస్థల్లో కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 21 లక్షల మంది ఇందులో భాగస్వాములయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా 1,06,598 పెండింగ్‌ ప్రభుత్వ ఫైళ్లను పరిష్కరించారు. 4551 టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి క్లీనింగ్ నిర్వహించారు. 12,303 ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్య వారంలో ప్రజారోగ్యం, వ్యాధి నిరోధక అవగాహన, మాతా శిశు ఆరోగ్యం, హెచ్‌ఐవీ నివారణ, ఆయుష్‌, డ్రగ్స్‌ నియంత్రణ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. నిమ్స్లో రూ. 30 కోట్ల లినాక్‌ సదుపాయం, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థలో రూ.24 కోట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ బ్లాక్‌ ప్రారంభమైంది. నాగర్‌కర్నూల్‌లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, తెల్కపల్లి పీహెచ్‌సీ వంటి వైద్య మౌలిక సదుపాయాలు కల్పించారు. 755 వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు.

వసతి గృహాల్లో తనిఖీలు..

Advertisement

ఇక రోడ్డు భద్రత–అరైవ్​ అలైవ్ కార్యక్రమంలో 4,512 గ్రామ రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు. 1,39,729 మంది అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 393 ప్రమాదకర జంక్షన్లు, 548 బ్లాక్‌స్పాట్లు గుర్తించి తక్షణ చర్యలు చేపట్టారు. 519 కంటి పరీక్షా శిబిరాల్లో 16,079 డ్రైవర్లను పరీక్షించగా 4,863 మందికి దృష్టి సమస్యలు గుర్తించారు. గోల్డెన్‌ అవర్‌, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌, మద్యం సేవించి డ్రైవింగ్‌ నివారణపై విస్తృత ప్రచారం జరిగింది. సంక్షేమ వారంలో 1,574 సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీలు జరిగాయి. హాస్టళ్లలో వసతులు, పరిశుభ్రత, భద్రతపై సమీక్షించారు. 9,275 నిరుద్యోగ యువతను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానించారు.

Also read: GHMC: ఉద్యోగుల రక్తం తాగుతున్న జీహెచ్ఎంసీ తిమింగలాలు.. జీతం కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు.!

1,702 అవగాహన సదస్సులు..

Advertisement

159 సమ్మర్‌ క్యాంపుల ద్వారా 24,415 విద్యార్థులకు క్రీడలు, యోగా, కళలు, డిజిటల్‌ లిటరసీ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. బడి బాట కార్యక్రమం ద్వారా బడి బయట పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమాలు జరిగాయి. చైల్డ్‌ సేఫ్టీ, సే నో టు డ్రగ్స్ వారంలో షీ టీమ్స్‌, ఏహెచ్‌టీయూ, భరోసా కేంద్రాల ద్వారా 1,702 అవగాహన సదస్సులు నిర్వహించారు. 1,55,600 మందికి పైగా ఇందులో పాలుపంచుకున్నారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్‌ భద్రత, డ్రగ్స్‌ దుష్ప్రభావాలు, 100, 112, 1098, 181, 1930 హెల్ప్ లైన్టపై అవగాహన కల్పించారు. 10–18 ఏళ్ల పిల్లలకు స్థానిక సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించే బాల్ పంచాయత్‌ కార్యక్రమం ప్రారంభించారు.

మైక్రో ఇరిగేషన్‌ సబ్సిడీ..

రైతు వారంలో వ్యవసాయం, ఉద్యానవనం, మార్కెటింగ్‌, సహకార, బ్యాంకులు, పశుసంవర్థక, మత్స్య, సాగునీటి శాఖలు కలిసి కార్యక్రమాలు చేపట్టాయి. మట్టి ఆరోగ్యం, సహజ వ్యవసాయం, పంటల వైవిధ్యం, డ్రోన్‌ వినియోగం, సోలార్‌ పంపులు, ఆయిల్‌పామ్‌, ఎఫ్‌పీఓలు, రుణ మేళాలపై రైతులకు అవగాహన కల్పించారు. 95 నియోజకవర్గాల్లో 76,024 మంది రైతులకు మైక్రో ఇరిగేషన్‌ సబ్సిడీలపై వివరించారు. 32,818 మంది రైతులు రుణ మేళాల్లో పాల్గొన్నారు. హన్మకొండలో మెగా రైతు మేళా జరిగింది. టీజీ ఆర్గానిక్స్‌ యాప్‌, నిగ్రాని సమితులు, కోఆపరేటివ్‌ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి.

నియామక పత్రాలు..

యువజన–క్రీడల వారంలో ఫిట్‌నెస్‌, నాయకత్వం, ఉపాధి, సాంస్కృతిక చైతన్యంపై రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. 5కే మారథాన్, యోగా, జుంబా సెషన్లు,యూత్‌ పార్లమెంట్‌లు, పర్యాటక క్లబ్‌లు, పరిశుభ్రత డ్రైవ్‌లు, జాబ్‌ మేళాలు నిర్వహించారు. ఉపాధి పొందిన యువతకు నియామక పత్రాలు, క్రీడా విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. మహిళా వారంలో మహిళా సాధికారత, పోషణ, మాతా శిశు ఆరోగ్యం, జీవనోపాధి, ఎస్‌హెచ్‌జీల బలోపేతానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. రూ. 6 కోట్లతో నిర్మించిన 50 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 27 అంగన్‌వాడీ భవనాలు, 7,292 గ్రామాల్లో స్త్రీ శక్తి భవనాలు, 131 ఫుడ్‌ గ్రెయిన్‌ గోదాములు, 577 లైవ్లీ హుడ్‌ వర్క్ షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి.

Also read: గంటల పని నిమిషాల్లో.. ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండాల్సిన మ్యాజికల్ గ్యాడ్జెట్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×