E-Paper
Advertisement

Chanchalguda Jail: కడుపు నొప్పితో ఖైదీ విలవిల.. లోపలున్నవి చూసి షాకైన వైద్యులు..

Chanchalguda Jail: కడుపు నొప్పితో ఖైదీ విలవిల.. లోపలున్నవి చూసి షాకైన వైద్యులు..
Advertisement

Chanchalguda Jail: చంచల్‌గూడ జైలులో ఓ ఖైదీ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అతని కడుపులో మేకులు, టేపు చుట్టలు ఇతర వస్తువులను చూసి షాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడుపు నొప్పితో బాధపడుతున్న ఖైదీ ఎండీ సొహైల్‌(21)ను చంచల్‌గూడ జైలు ఎస్కార్టు పోలీసులు ఈ నెల 8న ఉస్మానియాలో చేర్పించారు.

జనరల్‌ సర్జరీ యూనిట్‌-7 వైద్యులు ఎక్స్‌రే తీసి పరిశీలించారు. రెండు మేకులు, షేవింగ్‌ బ్లేడు, ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు బి.రమేశ్‌కుమార్‌ ఎండోస్కోపీతో విజయవంతంగా వాటిని బయటకు తీశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ డా.బి.నాగేందర్‌ తెలిపారు. అయితే.. జైలు నుంచి బయటికి రావడానికే సొహైల్ వాటన్నింటినీ మింగి ఉంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×