E-Paper
Advertisement

Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?

Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?
Advertisement

Jeevan Reddy: జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, ముఖ్యంగా గత 20 నెలలుగా కొనసాగుతున్న పరిణామాలు భరించలేని స్థాయికి చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ.. ఏఐసీసీ సభ్యత్వానికి , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈ నెల 25వ తేదీన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

జీవన్ రెడ్డి తన అసంతృప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి వల్ల తన గౌరవానికి భంగం కలిగిందని, తన సమస్యలకు ముఖ్యమంత్రి దగ్గర కూడా పరిష్కారం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు, పాత నేతలకు ప్రాధాన్యత తగ్గడం వంటి అంశాలు ఆయనను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వంటి నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన తన నిర్ణయానికే మొగ్గు చూపారు.

Advertisement

రైతాంగ సమస్యలపై కూడా ఆయన గళమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు, సాగునీటి కష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 25న జగిత్యాలలోని బండారు గార్డెన్స్‌లో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ ఆయన తీసుకోబోయే ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read:పంజాగుట్టలో విషాదం.. శ్రీవాత్స అపార్ట్‌మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×