E-Paper
Advertisement

Swechcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో నిద్రలేచిన అధికారులు!

Swechcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో నిద్రలేచిన అధికారులు!
Advertisement

Swechcha Effect: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండల కేంద్రంలో గల శ్మశాన వాటికలో నీటి ఎద్దడిపై ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు, పాలకవర్గం తక్షణమే స్పందించారు. శ్మశాన వాటికలో కనీస నీటి సౌకర్యం లేక, చివరికి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి కూడా చుక్క నీరు దొరకని దుస్థితిపై ‘స్వేచ్ఛ’ పత్రిక “మంత్రి ఇలాకాలో మరణయాతన!” అనే శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ‘స్వేచ్ఛ’ పత్రిక ఎఫెక్ట్‌తో నిద్ర లేచిన సైదాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తక్షణమే రంగంలోకి దిగింది.

సర్పంచ్ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పనులు

గ్రామ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పంచాయతీ సిబ్బందితో కలిసి శ్మశాన వాటిక వద్ద గతంలో వేసిన బోరు బావికి ఈ రోజు యుద్ధప్రాతిపదికన కొత్త మోటారును బిగింపజేశారు. నీటి సరఫరాను పునరుద్ధరించి, శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

Advertisement

Also read: రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

స్వేచ్ఛ’ పత్రికకు కృతజ్ఞతలు

గత కొంతకాలంగా తాము పడుతున్న ఇబ్బందులను, ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్న వైనాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘స్వేచ్ఛ’ పత్రిక యాజమాన్యానికి, రిపోర్టర్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్త ప్రచురితమైన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన సర్పంచ్‌కు, పంచాయతీ పాలకవర్గానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇక్కడ శాశ్వత వాటర్ ట్యాంకును కూడా నిర్మించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Also read: బీఆరెస్‌పై ఫ్రీ బ‌స్సు సెంటిమెంట్‌! మ‌హిళ‌ల‌కు మేలు చేసే ప‌థ‌కంపై కుట్ర‌లా!?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×