E-Paper
Advertisement

High Court: వీధి కుక్కల సంరక్షణ.. సుప్రీం మార్గదర్శకాలను పాటించండి, GHMCకి హైకోర్టు ఆదేశం

High Court: వీధి కుక్కల సంరక్షణ.. సుప్రీం మార్గదర్శకాలను పాటించండి, GHMCకి హైకోర్టు ఆదేశం
Advertisement

High Court: వీధి కుక్కల సంరక్షణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఆస్రా (ASRA) అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఆస్రా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో వీధి కుక్కల జనాభా నియంత్రణ, వాటి సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం, GHMC అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని.. ఇది ప్రజలకు, జంతువులకు కూడా ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొంది. వీధి కుక్కల విషయంలో కేంద్ర జంతు సంక్షేమ బోర్డు, సుప్రీంకోర్టు విధించిన నియమ నిబంధనలను, ముఖ్యంగా జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడంలో GHMC వైఫల్యం చెందిందని సంస్థ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

Advertisement

దీనిపై స్పందించిన హైకోర్టు, కేవలం కుక్కలను పట్టుకుని తరలించడం లేదా చంపడం వంటి చర్యలకు బదులుగా.. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో కుక్కలకు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC) చేసి, రేబిస్ టీకాలు (Anti-Rabies Vaccination – ARV) వేయించే కార్యక్రమాన్ని GHMC యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలు, పురోగతిపై సమగ్ర నివేదికను త్వరలో కోర్టుకు సమర్పించాలని GHMC, ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు నొక్కి చెప్పింది.

ALSO READ: UP News: ఇది మామూలు షాక్ కాదు భయ్యో.. అత్తగారింట్లో అడుగుపెట్టిన 20 మినిట్స్‌లోనే..?

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×