E-Paper
Advertisement

Warangal: వరంగల్‌లో హై టెన్షన్.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు..

Warangal: వరంగల్‌లో హై టెన్షన్.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు..
Advertisement

Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టడం కేవలం ఒక విగ్రహం ధ్వంసం మాత్రమే కాకుండా, ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీసే చర్యగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కిన తరుణంలో, ఈ దుశ్చర్య గ్రామంలో అశాంతికి ఆజ్యం పోసింది.

ఈ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారు. అయితే, రాజకీయ కక్షలతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానిక గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు బలంగా ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో నెలకొన్న రాజకీయ విభేదాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని, అభివృద్ధి పనులలోనూ, విగ్రహాల ఏర్పాటులోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

శివాజీ మహారాజ్‌ను తమ ఆరాధ్య దైవంగా భావించే ఆరె కులస్తులు ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు గ్రామంలో భారీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. “హిందూ ధర్మ పరిరక్షకుడైన శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టడం క్షమించరాని నేరం” అని వారు పేర్కొంటున్నారు. విగ్రహం వద్దకు భారీగా చేరుకున్న కుల సంఘాల నాయకులు, యువత, దోషుల అరెస్ట్ జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఫోకస్.. రూల్స్ బ్రేక్ చేస్తే కటకటాలే!

Advertisement

పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు బందనపల్లి గ్రామంలో భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గ్రామంలో 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పోలీసులు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది, రాజకీయ వర్గాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×