E-Paper
Advertisement

Six year old girl raped and murdered: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య

Six year old girl raped and murdered: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య
Advertisement

Six year old girl raped and murdered: పెద్దపల్లిలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న అభం..శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ దుర్మార్గుడు పైశాచికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు.ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్లు వద్ద చోటుచేసుకుంది. రైసు మిల్లులో గురువారం రాత్రి తల్లితోపాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బల్‌రామ్.. ఆ బాలికను ఎత్తుకెళ్లాడు. అనంతరం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఆ తర్వాత కొంత సమయానికి కుతూరు తన పక్కన కనిపించకపోవడంతో తోటి కార్మికులకు విషయం చెప్పింది. అందరూ కలిసి పరిసరాల్లో వెతకడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో ఓ పొదల్లో విగతజీవిగా పడి ఉన్న బాలిక మృత దేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి మృతదేహంపై పడి బోరున విలపించింది.

బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు..

Advertisement

కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను డ్రైవర్ సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడగొట్టాడు. అతడు ఆ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వెంటనే స్థానికులు నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష చేయనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు స్పాట్ డెడ్

Advertisement

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బలరామ్ కొన్నాళ్లుగా కాట్నవల్లిలో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడే ఆసిఫాబాద్ జిల్లాలోని దాయిగాం గ్రామానికి చెందిన ఓ దంపతులు ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. గత కొంతకాలంగా అక్కడే పనిచేస్తున్న బలరామ్.. గురువారం అర్ధరాత్రి బాలికను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించి అక్కడే గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. తమ బిడ్డను హత్య చేసిన నిందితుడిని ప్రాణాలతో వదలకూడదని, ఎన్ కౌంటర్ చేయాలని ఆ బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×