E-Paper
Advertisement

బండి భగీరథ్ కేసులో మరో సంచలనం.. జడ్జిపై ట్రోలింగ్‌ వ్యవహారంలో రంగంలోకి ‘సిట్’!

బండి భగీరథ్ కేసులో మరో సంచలనం.. జడ్జిపై ట్రోలింగ్‌ వ్యవహారంలో రంగంలోకి ‘సిట్’!
Advertisement

Bandi Bhagirath: స్వేచ్ఛ బ్యూరో: బండి భగీరథ్​ పై నమోదైన పోక్సో కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంలో హైకోర్టు న్యాయమూర్తి పై సోషల్​ మీడియాలో కొందరు పెట్టిన అనుచిత పోస్టులపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం తాజాగా మరో సిట్​ ఏర్పాటు చేసింది. హైదరాబాద్​ జాయింట్​ కమిషనర్ శ్వేత కు సిట్​ కు ఇన్​ ఛార్జ్​ గా నియమించారు.

మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్​ బషీరాబాద్ పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు బీఎన్​ఎస్​ తోపాటు పోక్సో యాక్ట్​ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే బండి భగీరథ్​ కోసం గాలింపు చేపట్టారు. దాంతో బండి భగీరథ్​ తనకు మధ్యంతర బెయిల్​ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ మాధవీ దేవి విచారణ జరిపారు.

Advertisement

అయితే, విచారణ జరపటానికి ముందే కొంతమంది సోషల్​ మీడియాలో బండి భగీరథ్​ కు బెయిల్​ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా జడ్జి మాధవీ దేవి భర్తకు బార్​ కౌన్సిల్​ ఛైర్మన్​ పోస్ట్​ ఇస్తారంటూ అనుచిత పోస్టులు పెట్టారు. మధ్యంతర బెయిల్​ పిటిషన్ పై విచారణ జరిపినపుడు జడ్జి మాధవీ దేవి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రచారం తనను బాధకు గురి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది.

ఈ క్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్​ ఫిర్యాదు చేయగా దీనిపై చార్మినార్​ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ ప్రారంభించి నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్​ కూడా చేశారు. కాగా, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రభుత్వం మంగళవారం సిట్​ ఏర్పాటు చేసింది. దానికి ఇన్​ ఛార్జ్​ గా హైదరాబాద్ జాయింట్ సీపీ శ్వేతను నియమించారు.

Advertisement

Also Read: నోరు అదుపులో పెట్టుకో అరవింద్.. మాకూ మాట్లాడటం తెలుసు.. అడ్లూరి వార్నింగ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×