E-Paper
Advertisement

హైదరాబాద్‌లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

హైదరాబాద్‌లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!
Advertisement

Harish Babu: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే, తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన జపాన్ దేశంలోని హిరోషిమాకు చెందిన ప్రజాప్రతినిధుల బృందంతో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసనమండలి కమిటీ హాల్‌ను సందర్శించిన ఈ విదేశీ ప్రతినిధులకు మన రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో జపాన్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా, ఇక్కడి యువతకు ఉపాధి దొరికేలా నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) అందించాలని కోరారు.

Advertisement

ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీ (వ్యవసాయ సాంకేతికత), వైద్య రంగాల్లో రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జపాన్ సాంకేతికత ఇక్కడి రైతులకు, వైద్య రంగానికి ఎంతో ప్లస్ అవుతుందని, దీనివల్ల పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు మరిన్ని పెట్టుబడులకు దారితీస్తాయని భావిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×