E-Paper
Advertisement

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణ రెడ్డి పదవి బాధ్యతలు

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణ రెడ్డి పదవి బాధ్యతలు
Advertisement

Aliabad Municipality: మేడ్చల్ బ్యూరో స్వేచ్ఛ : అలియాబాద్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన శిరీష కృష్ణ రెడ్డి  పదవి బాధ్యతలు స్వీకరించారు చేశారు. పదవి బాధ్యతల స్వీకరణకు ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యక్షులు వజ్రష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,మాజీ డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ హజరయ్యారు.

మున్సిపాలిటీ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం 

ఈ సందర్భంగా చైర్మన్ శిరీష కృష్ణ రెడ్డి మాట్లాడుతూ అలియాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, శుభ్రత, తాగునీరు, రోడ్లు, కాలువలు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Janasena: నెల్లూరు జనసేనలో నాయకత్వ సెర్చ్.. పవన్‌ సైన్యం.. రథసారధి ఎక్కడ?

మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం

మేడ్చల్. స్వేచ్ఛ: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌గా జాము రవి, వైస్ చైర్‌పర్సన్‌గా శశిరేఖతో పాటు కౌన్సిలర్లు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గాన్ని అధికారులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

పాలకవర్గంతో కలిసి సమన్వయంతో కృషి చేస్తాం 

Advertisement

ఈ సందర్భంగా చైర్మన్ జాము రవి మాట్లాడుతూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి పాలకవర్గంతో కలిసి సమన్వయంతో కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల, శుభ్రత, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాపి రెడ్డి, ప్రియాంక, శ్రీవాణి, సరిత, నీరజ్ గౌడ్, నవీన్ నాయక్, లత, శ్రీలత, గోవర్ధన్ రెడ్డి, రాజు, మౌనిక, విష్ణువర్ధన్ రెడ్డి, జంగా రెడ్డి, స్వప్న, మహేశ్వరి, జ్యోతి, రమేష్, మల్లేష్, లత, అజయ్ కుమార్, ప్రభాకర్, మాధవి తదితరులు, అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Also Read: Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×