// //
Sircilla Councillor: తన వార్డులో పారిశుద్ధ్యం లోపించడంతో ఓ కౌన్సిలర్ పారిశుద్ధ్య కార్మికుడిగా మారి మురికి కాలువలను శుభ్రం చేశాడు. సిరిసిల్ల మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ వీధులు, మురికి నీటి కాలువలు శుభ్రం చేయడం లేదంటూ ఏడవ వార్డుకు చెందిన కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం తన వార్డులోని మురికి కాలువలను శుభ్రం చేసుకున్నాడు.
సుమారు గంటసేపు శ్రమించి మురికిని తొలగించి మురికినీరు నిల్వ ఉండకుండా చేశారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో తన వార్డు ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని శుభ్రం చేసుకున్నట్టు సదరు కౌన్సిలర్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వెంకటరాజం మోరీనీ శుభ్రం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూసిన నెటిజన్లు ప్రజా ప్రతినిధి అంటే ఇలా ఉండాలని, ప్రజల సమస్యల కోసం వారికి సేవలందించడం కోసం ఎలాంటి పనులైన చేయడం అభినందనీయమంటున్నారు.
Also read: Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్!
ఎన్నికల సమయంలో వార్డులోని వీధులు, మురికి కాలువలు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు చూస్తానని మాట ఇచ్చి ప్రజలతో ఓటు వేయించుకొని గెలిచానని, ఇచ్చిన మాట ప్రకారం శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత తనదే కాబట్టి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి మురికినీటి కాలువను ఎంతో శ్రమించి శుభ్రం చేసుకున్నట్లు సన్నిహితులకు వివరించాడు.
Also read: సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ.. ఆ విషయంలో అస్సలు తగ్గవద్దంటూ డిమాండ్!