E-Paper
Advertisement

మైక్రో ఫైనాన్స్ కేసులో మరో ట్విస్ట్.. సిటీ సివిల్ కోర్టులో మంగ్లీ పిటిషన్

మైక్రో ఫైనాన్స్ కేసులో మరో ట్విస్ట్.. సిటీ సివిల్ కోర్టులో మంగ్లీ పిటిషన్
Advertisement

Singer Mangli: మైక్రో ఫైనాన్స్​ వ్యవహారంలో సింగర్​ మంగ్లీ తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో తనపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తూ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగేలా ప్రసారం చేసిన వీడియోలను ఆయా ప్లాట్​ ఫాంల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.

మైక్రో ఫైనాన్స్ పేర మంగ్లీ, ఆమో సోదరుడు శివచౌహాన్​ మరికొందరు కలిసి పలువురి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది బాధితులు మీడియా ఎదుటకు వచ్చి తాము మోసపోయిన తీరును వివరించారు కూడా. ఈ కేసులో ఇప్పటికే సైబరాబాద్ ఎకనమిక్​ అఫెన్సెస్​ వింగ్ అధికారులు రమావత్ మధు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: BSNL మరో క్రేజీ ప్లాన్.. 3 నెలల పాటు.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్!

కాగా, ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ పేర్కొంది. అయినా, తన పరువుకు నష్టం కలిగేలా వేర్వేరు మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రసారం చేశాయని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ లో తెలిపింది. సోషల్ మీడియాలో ఉన్న లింకులను వెంటనే తొలగించటంతోపాటు భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ క్రమంలో కోర్టు పలు మీడియా సంస్థలు, యూట్యూబ్​ ఛానళ్లతోపాటు న్యాయవాది సుబ్బారావు, హిమాకాంతరెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Also Read: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. విజయ్‌కు అష్టకష్టాలు, ఎవరా ఆరుగురు ఎమ్మెల్యేలు?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×