E-Paper
Advertisement

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ కీలక నిర్ణయం

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ కీలక నిర్ణయం
Advertisement

Singareni Workers: స్వేచ్ఛ బ్యూరో: ఇప్పటివరకు సింగరేణిలో రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలుచేస్తున్న యూనియన్ బ్యాంక్.., సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది.

ఏప్రిల్ 1వ తేదీ..

సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్సు గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు జరిపింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా రూ.10 లక్షల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also read: హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికెళ్లదు ..?

ప్రత్యేక చొరవ..

ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.10 లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే కనీసం రూ.5 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి రూ.10 లక్షల బీమా పథకాన్ని అమలుచేస్తోంది. కాగా సింగరేణి సంస్థలో రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింపజేసేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటోంది.

Advertisement

Also read: ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగు.. సర్కార్ భారీ ప్లా‌న్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×