E-Paper
Advertisement

Hyderabad News: సిగాచి యాజమాన్యంపై చర్యలు.. ఆ కంపెనీ సీఈవో అరెస్ట్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు

Hyderabad News:  సిగాచి యాజమాన్యంపై చర్యలు.. ఆ కంపెనీ సీఈవో అరెస్ట్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు
Advertisement

Hyderabad News: సిగాచి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు సంగారెడ్డి పోలీసులు. ఘటన జరిగి ఆరు నెలలు గడుస్తున్నా, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు రాత్రి అరెస్ట్‌ చేశారు.  న్యాయస్థానం ఆయనకు రెండువారాలు రిమాండ్‌ విధించింది.

సిగాచి యాజమాన్యంపై చర్యలు 

Advertisement

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఒకటి. ఘటన జరిగి ఆరునెలలు గడిచినా యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఆ కంపెనీపై చర్యలు చేపట్టారు పోలీసులు. శనివారం రాత్రి సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ చేశారు పటాన్‌చేరు పోలీసులు. ఆ తర్వాత ఆయన్ని రిమాండ్‌కి తరలించారు.

ఈ ఏడాది జూన్ 30న పాశమైలారం కెమికల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు మరణించారు. ఆ తర్వాత ఆ పరిశ్రమను కొద్దిరోజులపాటు మూసివేశారు. కార్మికుల మృతితో సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పరిశ్రమలో ఘటనపై దాదాపు ఆరు నెలలుగా దర్యాప్తు చేసిన పోలీసులు, యాజమాన్యంపై చర్యలు చేపట్టారు.

Advertisement

సీఈవో అరెస్ట్ అమిత్‌రాజ్‌ సిన్హా, రిమాండ్‌కి తరలింపు

సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. ఈ కేసులో బాధ్యులను గుర్తించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఏఏజీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణలో దర్యాప్తు అధికారి న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించిన విషయం తెల్సిందే. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు ఇప్పటికీ పోరాటం చేస్తున్నాయి.

ఈ ఘటనలో 54 మంది మరణించారు. మృతి చెందినవారిని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని గుర్తించేందుకు చాలా రోజులు పట్టింది. 8 మంది మృతదేహాలు కనిపించలేదు. బాధితులకు పరిహారం అందించడంలోనూ నిర్లక్ష్యం చేసింది ఆ కంపెనీ యాజమాన్యం. ఈ కేసులో తదుపరి కార్యాచరణ ఎలాఉండబోతుందనే తెలియాల్సివుంది.

ఘటన జరిగినప్పుడు హడావుడి చేశారు అధికారులు. ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు అక్షింతలు వేయడంతో..  పోలీసులు హడావుడిగా సీఈవోని అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఖాయమని తెలుస్తోంది.

ALSO READ:  మరో ఉద్యమానికి సిద్ధమైన కాంగ్రెస్.. ఈసారి టార్గెట్ వారేనా?

యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఇంకా ఎవరెవరిని బాధ్యులు చేయనుంది? ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చేటప్పుడు ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి? వాటిని తప్పకుండా పాటిస్తున్నారా? లేదా? అనుమతులు ఇచ్చిన అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది? అనేదానికి సంబంధించి అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×