E-Paper
Advertisement

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ కు షాక్.. మెమో కొట్టివేసిన కోర్టు..

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ కు షాక్.. మెమో కొట్టివేసిన కోర్టు..
Advertisement

Farm house Case : తెలంగాణలో పెను ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు షాక్ తగిలింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు వేశారు. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో చట్టప్రకారం అక్కడ డబ్బు దొరకలేదని న్యాయస్థానం పేర్కొంది. ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరని తేల్చిచెప్పింది. కానీ పోలీసులు మాత్రం వారిని నిందితులుగా పేర్కొంటూ మెమో దాఖలు చేయడంపై ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Advertisement

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌.. ఇప్పటి వరకు సిట్‌ విచారణకు హాజరుకాలేదు. తమపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలు చేశారు. కేరళకు చెందిన డాక్టర్‌ జగ్గుస్వామికి జారీ చేసిన సీఆర్‌పీసీ 41ఎ నోటీసు అమలును నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే కేసులో బి.ఎల్‌.సంతోష్‌కు సిట్‌ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇరుపక్షాల వాదనలు విని నోటీసుల చట్టబద్ధతను తేలుస్తామని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాతే రోజే ఏసీబీ కోర్టు పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×