E-Paper
Advertisement

Shamshabad murder case: శంషాబాద్ మర్డర్ ..మృతిరాలి గుర్తింపు.. వీడని మిస్టరీ..

Shamshabad murder case: శంషాబాద్ మర్డర్ ..మృతిరాలి గుర్తింపు.. వీడని మిస్టరీ..
Advertisement
Women murder in shamshabad

Women murder in shamshabad(Hyderabad news today ):

శంషాబాద్‌లో జరిగిన మహిళ హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. మృతురాలిని శంషాబాద్‌ మండలం రాల్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. ఆమె కడుపునొప్పిగా ఉందని భర్తకు చెప్పి ఈ నెల 10న శంషాబాద్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను చెప్పిన వివరాలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలాయి. దీంతో హత్యకు గురైన మహిళను మంజులగా పోలీసులు తేల్చారు.

మొబైల్‌ ఫోన్ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మంజుల చివరగా ఎవరికి ఫోన్‌ చేశారో తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్వోటీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్‌ సమీపంలో మహిళను దుండగులు తగులబెట్టారు. మంజుల ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్లారు? నిందితులు ఆమెను అక్కడకు ఎందుకు తీసుకెళ్లారు ? హత్యకు కారణాలేంటి? ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

శంషాబాద్ లో జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జవహర్ నగర్ లో యువతిని ఓ ఉన్మాది వివస్త్రను చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. కొన్ని రోజుల వ్యవధిలో మరో మహిళ దారుణహత్యకు గురికావడం నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×