E-Paper
Advertisement

Kavitha: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు

Kavitha: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
Advertisement

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్. దీనిపై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 1న కరీంనగర్‌లో జాగృతి జనం బాట కార్యక్రమంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె మాటలు రాజకీయ దుమారం రేపాయి.

తన భర్త ఫోన్ ట్యాప్ చేశారు!
అయితే కవిత స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారా? అంటూ ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వార్తలు వినగానే కడుపులో ఏదోలా అనిపించేది అని చిట్‌చాట్‌లో వెల్లడించారు.

Advertisement

అవమానించినందు వల్లే పార్టీకి దూరమయ్యానని వెల్లడి
పార్టీలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగితే భరిస్తాను… కానీ అవమానాన్ని మాత్రం సహించబోను అని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసమే పార్టీతో విభేదించాను అని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అవ్వడం, కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం వంటి సంఘటనలు దీనికి కారణం అని తెలిపారు.

Also Read: సీఎం చొరవ.. పెండింగ్ బిల్లులు క్లియర్

Advertisement

పార్టీలో అసంతృప్తి – టచ్‌లోకి వచ్చారు
బీఆర్ఎస్‌లో చాలామంది అసంతృప్తితో ఉన్నారు అని కవిత వెల్లడించారు. తాను పార్టీ నుంచి బయటపడిన తర్వాత వారు తనకు టచ్‌లోకి వచ్చారు. పాత కేడర్ తో ‘జనం బాట’లో మాట్లాడుతున్నారు అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో SIB ద్వారా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు. సిట్ దర్యాప్తు జరుగుతోంది. కవిత గతంలో కూడా కేటీఆర్ సంబంధులు, హరీష్ రావు, సంతోష్ రావులు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీని ఫలితంగా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా పరిశ్రమ ప్రముఖులు టార్గెట్ అయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×