E-Paper
Advertisement

HILT GO: సెక్రటేరియట్‌లో లీకువీరుల కలకలం.. డైరెక్ట్ కేటీఆర్‌తోనే లింక్, ఎవరా దొంగలు..?

HILT GO: సెక్రటేరియట్‌లో లీకువీరుల కలకలం.. డైరెక్ట్ కేటీఆర్‌తోనే లింక్, ఎవరా దొంగలు..?
Advertisement

HILT GO: తెలంగాణ సెక్రటేరియట్‌లో కీలకమైన ‘హిల్ట్ జీవో’ లీకేజీ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ లీకేజీ వెనుక ఎవరు ఉన్నారు..? దీని ఉద్దేశం ఏమిటి..? అన్న కోణంలో విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలు ఈ వ్యవహారంపై రాజకీయంగా, పాలనాపరంగా పెద్ద దుమారం రేపే అవకాశం ఉంది.

ఈ ‘హిల్ట్ జీవో’ కాపీ నేరుగా మాజీ మంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేటీఆర్ మొబైల్‌కు చేరినట్లు విజిలెన్స్ దర్యాప్తులో స్పష్టమైంది. జీవో అధికారికంగా విడుదల కాకముందే.. దాని ముసాయిదా కాపీని కేటీఆర్‌కు చేరవేశారు. ఇది సాధారణ తప్పిదం కాదని.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న స్పష్టమైన ఆలోచన అని అంటున్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ లీక్ జరిగిందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

ఈ లీకేజీ వెనుక పరిశ్రమల శాఖలోని అత్యున్నత స్థాయిలో ఉన్నవారే కీలకంగా వ్యవహరించినట్లు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఈ కీలక వ్యక్తి తమ మొబైల్ నుంచే జీవో కాపీని నేరుగా కేటీఆర్‌కు పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత గోప్యంగా ఉండాల్సిన జీవో తయారీ ప్రక్రియ సమయంలో సెక్రటేరియట్‌లో కొద్దిమంది అధికారులకు మాత్రమే దానిని చూసేందుకు, దానిపై పనిచేసేందుకు యాక్సెస్ ఉంది.

విజిలెన్స్ దర్యాప్తు ఇప్పుడు ఆ కొద్దిమంది అధికారుల కదలికల చుట్టూ కేంద్రీకృతమైంది. జీవో తయారీ సమయంలో వారు ఎవరు, ఎక్కడ ఉన్నారు, వారి కమ్యూనికేషన్ వివరాలు ఏమిటి అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా, కేటీఆర్‌తో ఈ లీకువీరులకు ఉన్న సంబంధాలు ఏంటి? గతంలో వీరి మధ్య ఏమైనా పరిచయాలు, లావాదేవీలు ఉన్నాయా? అనే అంశాలపై విజిలెన్స్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Advertisement

ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచాలనుకున్న పత్రాలు ప్రతిపక్ష నేతకు చేరడం వెనుక ఉన్న ఉద్దేశంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ లీక్ జరిగిందా లేక అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనేది తేల్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విజిలెన్స్ నివేదిక తర్వాత మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: Vikarabad News: సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మిస్సింగ్.. ఆ జిల్లాలో సంచలనం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×