E-Paper
Advertisement

Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Advertisement

Bakki Venkataiah: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చనిపోయిన రెండు నెలల చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ హామీ ఇచ్చింది జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పరామర్శించారు. బాధిత కుటుంబాలతో కమిషన్ సభ్యులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడారు.

పోలీసుల నిర్లక్ష్యం..

కుమ్మెర గ్రామంలో సంఘటన చాలా అవమానకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగిందన్నారు. ఈ సంఘటనకు గల కారణాలను కలెక్టర్, ఎస్పీల ద్వారా అడిగి తెలుసుకున్నాం అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఇందులో కనిపిస్తుందని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సరియైన సూచనలు ఇచ్చి ఉంటే పాప చనిపోయేది కాదని, బాధితులకు న్యాయం జరిగేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిజిపి(DGP) దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Also Read: Pak Fake Judge: ఓరి మీ దుంపతెగ.. హైకోర్టును వదల్లేదు కదరా.. పాక్‌లో విచిత్ర ఘటన!

ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులపై హత్యాయత్నం కేసు పాటు ఎస్సీ(SC) ఎస్టీ(ST) అడ్రస్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బాధిత కుటుంబానికి జిల్లా కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామంలో కుటుంబానికి రక్షణ కల్పించేలా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది అన్నారు.

Advertisement

Also Read: Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు సెగ.. వరుస బెదిరింపులతో పోలీసుల హై అలర్ట్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×