E-Paper
Advertisement

తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. కంచి పీఠాధిపతి తొలి స్నానం, ఆపై 12 రోజులపాటు

తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. కంచి పీఠాధిపతి తొలి స్నానం, ఆపై 12 రోజులపాటు
Advertisement

Kaleshwaram: తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా మొదలయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుణ్య స్నానం ఆచరించడంతో ఈ పుష్కరాలను ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం

Advertisement

తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలకు సుమారు 20-30 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.  12 రోజులపాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టు కొన్న ప్రభుత్వం, ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేసింది.

సరస్వతీ ఘాట్‌తోపాటు ప్రధాన ఘాట్‌ వద్ద స్నానాలు ఆచరించేవారు దుస్తులు మార్చుకొనేందుకు వీలుగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. నదిలో లోతుకు వెళ్లకుండా తాళ్లతో హద్దులు ఏర్పాటు చేశారు. జూన్ ఒకటి నుంచి ప్రతిరోజు సాయంత్రం హారతి ఉంటుంది. అంత్య పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు వస్తారని చెబుతున్నారు.

Advertisement

కంచి పీఠాధిపతి తొలి స్నానం, 12 రోజులపాటు

ప్రాణహిత-గోదావరి నదుల్లో అంతర్వాహిణిగా సరస్వతి నది ప్రవహిస్తోంది. అందుకే ఆ ప్రాంతం కాళేశ్వరంగా ప్రసిద్ధి కెక్కింది. దేశంలో సరస్వతి నది యూపీలోని ప్రయాగ్‌రాజ్, రెండోది కాళేశ్వరంలో ఉంది. అక్కడ కుంభమేళా నిర్వహించగా, తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలకు ప్రాధాన్యం ఇచ్చింది.

ఈ పుష్కరాల్లో నది స్నానం చేయడం, పితృతర్పణాలు చేయడంతో ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో, అంత్య పుష్కర సమయంలో అవే ఫలితాలుంటాయని చెబుతున్నారు వేద పండితులు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది.

ALSO READ: రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×