// // Seethakka: మేడారం జాతర విజయానికి పారిశుధ్య కార్మికుల సేవలు -->
E-Paper
Advertisement

Seethakka: మేడారం జాతర విజయానికి పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: మేడారం జాతర విజయానికి  పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!
Advertisement

Seethakka: జాతర విజయానికి పారిశుధ్య సిబ్బంది కృషి, సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ల మంత్రి సీతక్క (Seethakk) పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. జాతర కాలమంతా నిరంతరంగా క్షేత్రస్థాయిలో పనిచేసి, మేడారాన్ని పరిశుభ్రంగా ఉంచినందుకు సిబ్బందికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Seethakka: మేడారంలో విజయవంతమైన సీఎం పర్యటన.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క!

పారిశుధ్య పనులు ఎంతో ముఖ్యం

Advertisement

జాతర ముగిసిన తర్వాత కూడా పారిశుధ్య పనులు ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి, మేడారంలో పూర్తిస్థాయిలో పరిశుభ్రత సాధించే వరకు శానిటేషన్ సిబ్బంది విధులు కొనసాగించాలని ఆదేశించారు. మేడారానికి రాకపోకలు సాగించిన రహదారులు, పరిసర ప్రాంతాలు గద్దెల ప్రాంగణాలు, భక్తుల బస ప్రాంతాలు పూర్తిగా శుభ్రపడి, స్వచ్ఛమైన మేడారాన్ని గ్రామస్తులకు అప్పగించే వరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే పనిచేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, మేడారాన్ని పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. జాతర అనంతరం కూడా అదే బాధ్యతతో పనిచేసి, గ్రామస్తులకు స్వచ్ఛమైన మేడారాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Minister Seethakka: గాంధీని మరోసారి హత్య చేశారు.. కేటీఆర్‌తో ‘ఫుట్‌బాల్’ ఎలా ఆడాలో సీఎంకు తెలుసు: మంత్రి సీతక్క ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×