E-Paper
Advertisement

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!
Advertisement

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో టీజీఎస్‌ఆర్‌టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయకోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం ఆపారు. అయితే, బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

సాధారణంగా ఇలాంటి సమయంలో జరిమానా వేయాలి, కానీ సదరు చెకింగ్ అధికారి మాత్రం అడ్డదారి తొక్కారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే కండక్టర్, ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చిన్న పొరపాటుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో కండక్టర్ సహనం కోల్పోయారు.

Advertisement

అవినీతికి పాల్పడుతున్న అధికారి తీరుపై ఆగ్రహించిన కండక్టర్, వెంటనే తన చెప్పు తీసి సదరు అధికారిని చితకబాదాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు కూడా కండక్టర్‌కు మద్దతుగా నిలిచి, అధికారిపై దాడికి దిగారు. లంచం అడిగిన అధికారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తప్పును సరిదిద్దాల్సిన అధికారి లంచం అడగడం ఏంటని జనం మండిపడుతున్నారు.

Also Read: మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×