E-Paper
Advertisement

Ganja Seizure: హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఆ ఫోన్ కాల్‌తో.. కట్ చేస్తే!

Ganja Seizure: హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఆ ఫోన్ కాల్‌తో.. కట్ చేస్తే!
Advertisement

Ganja Seizure: సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో భారీ ఎత్తున నిల్వ చేసిన 1కిలో 114 గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలం సృష్టించింది.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ గంజాయిని కర్ణాటకలోని బీదర్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్‌కు చెందిన అజయ్ కుమార్ గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుండి గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్, రవాణాకు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ గంజాయి వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? బీదర్‌లో దీనిని ఎక్కడ కొనుగోలు చేశారు? హైదరాబాద్‌లో ఎవరికి సరఫరా చేయాలని ప్లాన్ చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని.. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Also Read: హర్యానా నెంబర్ ప్లేటుతో మారుతి కారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×