E-Paper
Advertisement

Sandhya Sridhar Rao: క్షుద్రపూజలు చేసి మాగంటిని నేనే చంపేశా..15 రోజుల్లో నిన్ను కూడా.. సంధ్య శ్రీధర్ రావు ఆడియో లీక్

Sandhya Sridhar Rao: క్షుద్రపూజలు చేసి మాగంటిని నేనే చంపేశా..15 రోజుల్లో నిన్ను కూడా.. సంధ్య శ్రీధర్ రావు ఆడియో లీక్
Advertisement

Sandhya Sridhar Rao: BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చావుకు తానే కారణమని.. క్షుద్రపూజలు చేసి లేపేశానంటూ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారాయి. అందులో ఓ కాంట్రాక్టర్‌ను నీకు కూడా క్షుద్రపూజలు చేస్తానని బెదిరించారు. కేఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ద్వారా శ్రీధర్ రావు మట్టిని తరలించడంతో పాటు వేర్వేరు పనులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీని గురించి ఆయన అడగగా.. నన్నే డబ్బు అడుగుతావా.. క్షుద్ర పూజలు చేసి మాగంటి గోపినాథ్‌ను చంపినట్లు.. నిన్ను కూడా అంతం చేస్తానంటూ భయపెట్టాడు.

కిడ్నీలు ఫెయిలై చనిపోతావని.. నీ భార్య వారం రోజుల్లో విధవరాలు అవుతుందని హెచ్చరించాడు. దాంతోపాటు అసభ్యకర పదజాలంతో దూషించాడు. 15 రోజుల్లో నీ డౌన్‌ఫాల్ స్టార్ట్‌ అవుతుందని ఓ వ్యక్తికి సంధ్య శ్రీధర్‌రావు వార్నింగ్‌ ఇచ్చాడు. 15 రోజుల్లో మాగంటిని దహనం చేసిన శ్మశానంలోనే నువ్వు కూడా ఎండ్ అవుతున్నావంటూ హెచ్చరించాడు. నన్నే బెదిరిస్తావా అంటూ బండ బూతులు తిట్టాడు సంధ్య శ్రీధర్‌రావు.

Advertisement

భవన నిర్మాణాలు చేస్తానని వినియోగదారులను నిండా ముంచేసిన కేసుల్లో సంధ్య శ్రీధర్ రావు నిందితుడిగా ఉన్నాడు. జంట నగరాల కమిషనరేట్ పరిధిలో 40కిపైగా కేసులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులను, సిస్టంను మ్యానేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతుంటాడని ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై ఇటీవలే FCI లేఔట్ ఆక్రమించారనే ఆరోపణలపై కేసు నమోదయింది.

Also Read: ఏందప్పా.. ఈ రప్పా.. రప్పా? పుష్ప డైలాగ్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం

Advertisement

మరోవైపు ఇటీవలే సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావుపై.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు అయ్యాయి. 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు అయ్యాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×