E-Paper
Advertisement

Rythu Panduga: రైతుల‌కు గుడ్ న్యూస్.. నాలుగో విడుత రుణమాఫీ.. రూ.2747.67 కోట్లు విడుదల

Rythu Panduga: రైతుల‌కు గుడ్ న్యూస్.. నాలుగో విడుత రుణమాఫీ.. రూ.2747.67 కోట్లు విడుదల
Advertisement

Rythu Panduga: రెండు ల‌క్ష‌లు రుణం తీసుకుని మాఫీ కాని రైతుల‌కు మ‌హబూబ్ న‌గ‌ర్ రైతు పండుగ స‌భ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు. రుణ‌మాఫీలో నెల‌కొన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి నిధుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రుణ‌మాఫీ జ‌ర‌గ‌ని 3.14 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల‌లోకి ఈ నిధులు జ‌మ అవుతాయ‌ని చెప్పారు.

Also read: కేటీఆర్.. ఇక కనపడరా? ఆ పరాభావంతో ఊహించని నిర్ణయం, ఇక కేసీఆర్ లాగే..

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్ర‌భుత్వం రూ.2 ల‌క్ష‌ల లోపు రుణాలు తీసుకున్న రైతులంద‌రికీ రుణ‌మాఫీ చేసింది. కొంత‌మందికి ఆధార్ లో స‌మ‌స్య‌లు, టెక్నిక‌ల్ కార‌ణాలు, రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం ఉండ‌టం వ‌ల్ల మాఫీ అవ్వ‌లేదు. ఆ రైతుల‌కు కూడా న్యాయం జ‌రిగేలా నేడు రైతుపండుగ స‌భలోనే నిధులను విడుద‌ల చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో కేవ‌లం రూ.1 ల‌క్ష లోపు రుణం తీసుకున్న రైతుల‌కే రుణ‌మాఫీ చేశారు. 23 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే మాఫీ చేశారు.

రుణ‌మాఫీ ఒకేసారి కాకుండా విడ‌త‌ల వారిగా చేశారు. కానీ కాంగ్రెస్ హ‌యాంలో రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న రైతుల‌కు రుణ‌మాఫీ చేసినప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ రైతుల‌ను రెచ్చ‌గొట్ట‌డంతో బీఆర్ఎస్ స‌క్సెస్ అయింది. ప‌దే ప‌దే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాఫీ చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ రైతుల‌తో క‌లిసి ఆందోళ‌న‌లు చేపట్టింది. చివ‌రికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవ‌డంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×