E-Paper
Advertisement

RTC MD Sajjanar: సహకరించండి.. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

RTC MD Sajjanar: సహకరించండి.. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి
Advertisement

RTC MD Sajjanar: మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే తక్కువ దూరం వెళ్లే మహిళలు సిటీ సబర్బన్, లేదా పల్లె వెలుగు బస్సులను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు RTC యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని సజ్జనార్ చెప్పారు.

అంతేకాకుండా కొందరు మహిళలు.. అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని.. అలా చేయడం వల్రుల ప్రయాణ సమయం పెరుగుతుందన్నారు. ఇకపై ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో ఆపుతామని స్పష్టం చేశారు. నాలుగైదు నెలల్లో మరో 2 వేలకు పైగా కొత్తబస్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 400 ఎక్స్ ప్రెస్ లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నట్లు చెప్పారు. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సుల్ని వాడకంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×