E-Paper
Advertisement

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?
Advertisement

Damodar Rajanarsimha: స్వేఛ్చ బ్యూరో: జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్లలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు M రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రేస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థలు అభివృద్ది చెందాలంటే కాంగ్రేస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందజేస్తుందని, ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు, మహిళలు స్వయంగా ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్‌లు మంజూరు చేయిస్తామన్నారు.

మైనార్టీల కోసం రూ3 కోట్లతో..

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అందోలు మండలం పరిధిలోని సంగుపేట, మాసానిపల్లి ప్రాంతాల్లో నాలుగు కంపెనీలను ఏర్పాటు చే యిస్తానని మంత్రి హమీ ఇచ్చారు. రజకులు స్వయం ఉపాధి కోసం డ్రైక్లీనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.6 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నేపాల్‌ నుంచి వచ్చి ఇక్కడే పనిచేసుకొని జీవిస్తున్న కుటుంబాలకు కూడా అండగా ఉంటానని హమీ ఇచ్చారు. జోగిపేటలో మైనార్టీల కోసం రూ3 కోట్లతో బహద్దూర్‌ ఖాన్‌ ఫంక్షన్‌ హాలు నిర్మాణం చేపడతామన్నారు. రాజ రాజేశ్వర దేవాలయం మీదుగా బైపాస్‌రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Also Read: IND VS USA: ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే..300 కొట్ట‌డం ప‌క్కా, బుమ్రా, సంజు దూరం

ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను

ప్రజలు కార్పోరేట్‌ ఆసుపత్రుల వైపు చూడకుండా గాంధీ, నిమ్స్‌ వంటి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను పొందాలన్నారు. అందోలు–జోగిపేట మున్సిపాటీ పరిధిలోని 20 వార్డుల్లో కాంగ్రేస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జి.మల్లయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, మాజీ కౌన్సిలర్లు ఆకుల చిట్టిబాబు ముదిరాజ్, సురేందర్‌గౌడ్, సురేష్, డి.శంకర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Seetha Payanam: భూమిలో పుట్టింది.. శ్రీరాముల వారికి ప్రియమైనది.. ఇంట్రస్టింగ్‌గా ట్రైలర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×