// // Meerpet murder: మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య -->
E-Paper
Advertisement

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య
Advertisement

Meerpet murder: రాజధాని నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. పాత కక్షలను మనసులో ఉంచుకుని పక్కా స్కెచ్‌తో ప్రత్యర్థులు రౌడీషీటర్ నందనవనం సూరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. టీకేఆర్ కాలేజ్ సమీపంలోని ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పక్కా ప్రణాళికతో రప్పించి, ప్రతిఘటించే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

పుట్టినరోజు వేడుకల పేరుతో వేసిన డెత్ ట్రాప్
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రధాన నిందితుడైన అఫ్రోజ్, తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయంటూ సూరికి ఫోన్ చేసి మీర్‌పేట్ టీకేఆర్ కాలేజ్ సమీపానికి పిలిపించాడు. అఫ్రోజ్ మాటలు నమ్మి అక్కడికి చేరుకున్న సూరిపై ఒక్కసారిగా దాడికి దిగారు. సూరి తేరుకునే లోపే అతడి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, చూపు ఆనకుండా చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న వేటకత్తులతో విచక్షణారహితంగా నరికి పారిపోయారు. తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన సూరిని స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement

చెల్లెలు, తమ్ముడి హత్యలకు ప్రతికారమేనా?
ఈ హత్య వెనుక సుదీర్ఘమైన నేర చరిత్ర, పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సూరి తన భార్య సబా ఫాతిమాను భవనం పైనుంచి తోసి హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె సోదరుడైన మహమ్మద్ సల్మాన్‌ను కూడా టీకేఆర్ కామన్ వద్ద దారుణంగా పొడిచి చంపిన కేసులో సూరి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సల్మాన్ సోదరుడైన అఫ్రోజ్, తన అక్క, తమ్ముడి హత్యలకు ప్రతికారం తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూసి, ఈ విధంగా రౌడీషీటర్ సూరిని అంతమొందించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు..
నందనవనం సూరిపై హైదరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ కమిషనరేట్ల పరిధిలో పలు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పాటు, అతడిపై నగరం నుంచి బహిష్కరణ ఉత్తర్వులు కూడా అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నగర బహిష్కరణలో ఉన్న సూరి, తన రెండో భార్య తమ్ముడి బర్త్‌డే కోసం నందనవనానికి వచ్చిన సమాచారం తెలుసుకునే అఫ్రోజ్ ఈ ప్లాన్ అమలు చేసినట్లు సమాచారం. ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్ పోలీసులు, సంఘటనా స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా నిందితుడు అఫ్రోజ్, అతడికి సహకరించిన ముఠా కోసం ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Also Read: పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×