E-Paper
Advertisement

Hyderabad Crime: మాజీ మంత్రి ఇంట్లో చోరీ.. ఆధారాలు దొరికినట్లే?

Hyderabad Crime: మాజీ మంత్రి ఇంట్లో చోరీ.. ఆధారాలు దొరికినట్లే?
Advertisement

Hyderabad Crime: అదొక రద్దీగా ఉండే ప్రాంతం. అంతేకాదు వీవీఐపీలు నివాసముండే ప్రదేశమది. కానీ అక్కడ దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అది కూడ ఎవరి ఇంట్లోనో అనుకుంటే పొరపాటే. ఏకంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గృహంలో. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు రంగంలోకి దిగి ఇప్పటికే ఆధారాలు కూడ సేకరించినట్లు సమాచారం.

దొంగలు కూడ సంక్రాంతి సెలవులు తీసుకున్నారో ఏమో కానీ, పండుగ రోజుల్లో కాస్త తమ చేతివాటం ప్రదర్శించలేదనే చెప్పవచ్చు. కానీ అలా సంక్రాంతి పండుగ హంగామా అయిపోయిందో లేదో, మళ్లీ డ్యూటీకి ఎక్కినట్లు ఉంది చోరులు. అందుకే కాబోలు ఒక్కొక్క చోరీ వెలుగులోకి వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ చోరీ జరగగా, పోలీసులు ఇప్పటికే వారిని పట్టేసినట్లేనన్న రేంజ్ లో ఆధారాలు దొరికాయని తెలుస్తోంది.

Advertisement

హైదరాబాద్ లోని ఫిలింనగర్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కుటుంబం నివాసం ఉంటోంది. ఈ ఇంట్లో దొంగలు ప్రవేశించి, రూ.1.5 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నది మాత్రం తెలియరాలేదు. కానీ చోరీ జరిగిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణా దేవి ఇటీవల ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్ లను పరిశీలించారు. ఆ తర్వాత ఇంట్లో పని చేసే వారిని కూడ విచారించినట్లు తెలుస్తోంది. అసలే మాజీ మంత్రి ఇంట్లో చోరీ జరగడంతో, పోలీసులు కూడ అప్రమత్తమయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×