E-Paper
Advertisement

Road Accidents: నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి.. రిజల్ట్స్ వచ్చిన కాసేపటికే..

Road Accidents: నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి.. రిజల్ట్స్ వచ్చిన కాసేపటికే..
Advertisement

Road Accident in Telangana(Local news telangana) : తెలంగాణలో రహదారులు నెత్తురోడాయి. వరుస రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. వీరిలో ఒకరు సజీవదహనమయ్యారు. సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

వరంగల్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీ కొట్టడంతో.. నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారు ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. బుధవారం ఇంటర్ ఫలితాలు రావడంతో పార్టీ చేసుకుందామని నలుగురు ఓకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలిలో మృతిచెందగా మరొకరు హాస్పిటల‌్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Advertisement

పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన వరుణ్(18), సిద్ధు(18), రనిల్(19), గణేష్(18) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు సూర్యాపేట జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×