E-Paper
Advertisement

Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన

Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి తెరలేపాడు ఓ ఆర్ఎంపీ వైద్యుడు. మియాపూర్ లోని మయూరినగర్‌కు చెందిన RMP వైద్యుడు అలీ, నిజాంపేట్‌లోని రేష్మా క్లీనిక్ పేరుతో గత 20 ఏళ్లుగా నడుపుతున్నాడు. సైడ్ బిజినెస్ చిట్టీల వ్యాపారం మొదలెట్టి అటు క్లీనిక్, ఇటు చిట్టీల వ్యాపారం కొనసాగించాడు. కస్టమర్లు అధికంగా రావడంతో కొన్నేళ్లలోనే 50లక్షలు, 30లక్షలు, 20లక్షల చిట్టీలు నిర్వహించారు.

Advertisement

బండారీ లే అవుట్ కాలనీలో ఉంటున్న మహేశ్‌ను అకౌంటెంట్‌ను నియమించుకున్నాడు. గత 2 ఏళ్లుగా చిట్టీల డబ్బులు వసూలు కాకపోవడంతో కష్టాల్లో కూరుకుపోయాడు. దీంతో అలీపై ఒత్తిడి పెరిగింది. ఈనెల 8న క్లీనిక్‌లో సూసైడ్‌కు యత్నించాడు. ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అలీ భార్య ఫిర్యాదు మేరకు ఆ రోజే పోలీసులు కేసు నమోదు చేశారు. అలీ మళ్లీ క్లీనిక్‌కు వస్తుండటంతో.. బాధితులు చిట్టీల డబ్బుల కోసం క్లీనిక్, ఇంటికి క్యూ కట్టారు. చిట్టీల డబ్బుల గురించి అలీ, అతడి అకౌంటెంట్ మహేశ్ మధ్య వివాదం జరిగింది.

ALSO READ: CM Revanth Reddy: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇక అలా చేస్తే జీతంలో కోత.. త్వరలో కొత్త చట్టం: సీఎం రేవంత్

Advertisement

మహేశ్ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సూసైడ్ నోటును ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. మహేశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో బాధితులు రేష్మా క్లీనిక్ వద్దకు చేరుకుని అలీని నిలదీశారు. తనను అకౌంటెంట్ మోసగించాడని అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు మాత్రం అలీనే తమను మోసగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు నష్టపోయిన మొత్తం కోట్లల్లో ఉంటే.. కేసును ఆర్థిక నేరాల విభాగానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ALSO READ: Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×