E-Paper
Advertisement

RevanthReddy : నిరుద్యోగ మహాదీక్ష.. కాంగ్రెస్ సపోర్ట్.. రేవంత్ హౌస్ అరెస్ట్…

RevanthReddy : నిరుద్యోగ మహాదీక్ష.. కాంగ్రెస్ సపోర్ట్.. రేవంత్ హౌస్ అరెస్ట్…
Advertisement

RevanthReddy :హైదరాబాద్ లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నిరుద్యోగ మహాదీక్షకు పిలుపు ఇచ్చింది. విద్యార్థుల తలపెట్టిన ఆందోళనకు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడకక్కడే కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు.

ఓయూ జేఏసీ నేతృత్వంలో ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరుద్యోగ మహా దీక్ష చేపట్టేందుకు విద్యార్థి నేతలు సిద్ధమయ్యారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగా ఓయూ హాస్టల్ లో విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘం నేతలు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే నిరుద్యోగ దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఓయూకి వెళ్లి తీరుతానని రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు ఓయూకు వస్తే రేవంత్‌ను అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ హెచ్చరిస్తోంది.

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×